VIDEO: మా ఇంటి ఓట్లు అమ్మబడవు అంటూ పోస్టర్

VIDEO: మా ఇంటి ఓట్లు అమ్మబడవు అంటూ పోస్టర్

MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాసీపేట మండలం సోమగూడెంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అంటించిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న బాజ్జి తన ఇంటి ముందు "మా ఇంటి ఓట్లు అమ్మబడవు" అని రాసి పోస్టర్ అంటించారు. తమకు డబ్బులు ఇచ్చేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని అభ్యర్థులకు పరోక్షంగా సూచనగా ఈ పోస్టర్ ఉపయోగపడుతోంది.