కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ
PLD: నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృతిక శుక్లాని సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ కలెక్టర్‌తో సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించారు.