హిమాయత్‌సాగర్ రోడ్డు మూసివేత

HYD: హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి ఉంచడం వల్ల రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు వెళ్లే రహదారిని మూసివేసినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు. ఈ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. ఈ రోడ్డులో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.