నివాళులర్పించిన సినీ నటుడు నరేష్
E.G: రాజమండ్రిలో ప్రముఖ సినీ నటి విజయనిర్మల కుమారుడు నరేష్ బుధవారం పర్యటించారు. ప్రముఖ సామజికవేత్త డాక్టర్ పట్టపగలు వెంకట్రావు సతీమణి స్వర్గస్తులు అయిన సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నరేష్ నివాళులు అర్పించారు. ఈరోజు జరిగిన దశదినకర్మలో నరేష్ పాల్గొన్నారు. ఆయన వెంట రాజమండ్రి అర్బన్ బీజేపీ కన్వినర్ యెనుముల రంగబాబు, నగర ప్రముఖులు ఉన్నారు.