'బైకర్' మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

'బైకర్' మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

శర్వానంద్, అభిలాష్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'బైకర్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ. 18.09 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్, రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.