ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ
KNR: చొప్పదండి పట్టణంలోని 3వ వార్డులో కౌన్సిలర్ చిల్ల అర్చన శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య అధికారులు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేశారు. ఆరోగ్య భద్రత కల్పించే ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కార్డులు అందజేశారు. ఈ కార్డులను ఉపయోగించుకొని పేద ప్రజలు అవసరమైన వైద్య చికిత్సలు చేయించుకోవాలని కౌన్సిలర్ సూచించారు.