ఎన్నికల వేళ అన్నాడీఎంకేకు భారీ షాక్
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకేకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి సెంగొట్టయన్ విజయ్ సమక్షంలో టీవీకే పార్టీలో చేరారు. ఈ మేరకు మాజీమంత్రికి కండవా కప్పి పార్టీలోకి విజయ్ సాదరరంగా ఆహ్వానించారు. కొంతకాలంగా పళనిస్వామితో విభేదాలు నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి సెంగొట్టయన్ బహిష్కరణకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన టీవీకేలో చేరారు.