వృద్ధురాలి మృతదేహం లభ్యం

వృద్ధురాలి మృతదేహం లభ్యం

అల్లూరి: చింతపల్లి మండలం తాజంగి జలాశయం సమీపంలో ఆదివారం ఓ వృద్ధురాలి మృతదేహం కలకలం సృష్టించింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు కిటుముల పంచాయితీకి చెందిన వనుము పార్వతమ్మగా గుర్తించారు. మతిస్థిమితం కోల్పోయిన పార్వతమ్మ వారం క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదన్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.