విద్యుత్ సరఫరాకు అంతరాయం
KMR: విద్యుత్ మరమ్మతులలో భాగంగా కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కరెంట్ ఉండదని అధికారులు తెలిపారు. బద్దిపల్లి, నాగుల మాల్యల, కమాన్ పూర్ గ్రామాలతో పాటు గ్రానైట్ పరిశ్రమలు ఏరియాల్లో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు కరెంట్ ఉండదన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.