సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NGKL: అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 250 మందికి కోటి రూపాయల చెక్కులను ఎమ్మెల్యే వంశీకృష్ణ అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాటిదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు, ముఖ్యంగా వైద్య చికిత్సల కోసం ఈ నిధి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.