పులిగుమ్మిలో ఏనుగులు సంచారం

పులిగుమ్మిలో ఏనుగులు సంచారం

PPM: కొమరాడ మండలం పులుగుమ్మి గ్రామంలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు బుధవారం అటవిశాఖ అధికారులు తెలిపారు. సమీప గ్రామాలైన వన్నాం, కిచ్చాడ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాలకు వెళ్లేటప్పుడు చూసుకుని వెళ్లాలని రైతులను కోరారు. గ్రామాలకు దూరంగా ఏనుగులు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. పంటలు ధ్వంసం చేస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.