ఇద్దరు దొంగలు అరెస్టు.. చోరీ సొత్తు స్వాధీనం

AKP: పరవాడలో ఇటీవల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను సోమవారం లంకెలపాలెంలో పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణకి చెందిన కే.రవితేజ, లంకెలపాలెంకు చెందిన జే.కృష్ణ చైతన్యను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు ముప్పావు తులాలు బంగారు నగలు, 20 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు.