పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

MBNR: హన్వాడ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఎస్పీ డి.జానకి సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.