యంగెస్ట్ క్రికెటర్‌గా షఫాలీ వర్మ రికార్డ్
గాయపడిన ప్రతీక రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ షఫాలీ వర్మ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో అదరగొట్టింది. 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 87 పరుగులు చేసింది. దీంతో WWC ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్‌గా(21 ఏళ్లు) రికార్డు సృష్టించింది. అలాగే, WWC ఫైనల్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.