నగరపాలక తుది సర్వసభ్య సమావేశం

నగరపాలక తుది సర్వసభ్య సమావేశం

KRNL: నగర అభివృద్ధికి గత ఐదేళ్లుగా కృషి చేశామని, భవిష్యత్తులో కూడా పౌరులుగా నగర ప్రగతికి సహకారం అందిస్తామని మేయర్ బి.వై. రామయ్య తెలిపారు. ఇవాళ నగరపాలక సమావేశ భవనంలో తుది సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో 2026-27 బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతూ 72 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీధీదీపాలు, ఆక్రమణలు, వెండర్ జోన్లు, ట్రేడ్ లైసెన్సులపై చర్చించారు.