రైల్వే బ్రిడ్జి పై గుర్తుతెలియని మృతదేహం

SKLM: ఇచ్ఛాపురం-జాడుపూడి మధ్యలో జగనన్న కాలనీ వద్ద ఉన్న రైల్వే వంతెనపై గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ శనివారం మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 60 ఏళ్ల వయసు ఉంటుందని తెలుపు రంగు షర్టు, ఎరుపు రంగు లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ(రైల్వే) పోలీసులను సంప్రదించాలని కోరారు.