పేలుడు ఘటనపై దర్యాప్తు చేయాలి: ఆప్
ఢిల్లీలో భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ఈ దుర్ఘటనపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. పేలుడు జరిగి కొందరు మృతిచెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమంటూ 'X'లో పోస్టు పెట్టారు. ఈ పేలుడు ఎలా జరిగిందో, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే దానిపై పోలీసులు, ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు.