పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే
BDK: దమ్మపేట మండలం జగ్గారం గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా బూరుగుగుంపు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరలోనే చేపడుతామని హామీ ఇచ్చారు.