అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి విరాళం

తూ.గో: మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి అప్పనపల్లికి చెందిన గంటి మూర్తి కుటుంబ సభ్యులు మంగళవారం రూ.10,116 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.