రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి

ప్రకాశం: ఎర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ కర్నాటి వెంకటేశ్వర్ రెడ్డి ఇవాళ మృతి చెందారు. ఎర్రగొండపాలెం నుంచి గ్రామానికి వెళ్తున్న సమయంలో మూలమలుపు వద్ద ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కాపాడేందుకు ప్రయత్నం చేసిన ఉపయోగం లేకుండా పోయిందని స్థానిక ప్రజలు తెలిపారు.