చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు అందించాలి: MPDO

VZM: గ్రీన్ అంబాసిడర్‌లు ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని బొబ్బిలి MPDO రవికుమార్ ఆదేశించారు. ఇవాళ మెట్టవలసలో చెత్త సేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. కాలువలు, రోడ్లుపై చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు అందించాలన్నారు.