గొడ్డలితో నరికి హత్య.. నిందితుడి అరెస్ట్
ASF: తిర్యాణి మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హన్మంతరావును గొడ్డలితో హత్య చేసిన కేసులో నిందితుడైన రాయిసిడం వినోద్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. కస్టడీ నుంచి తప్పించుకున్న అతన్ని, జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో 2 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా, రెబ్బెన పోలీసులు మంగళవారం గోలేటి ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నారు. హత్యకు మూఢనమ్మకాలే కారణమని ASP అన్నారు.