త్వరలో జిల్లాకు రానున్న సీఎం..!

త్వరలో జిల్లాకు రానున్న సీఎం..!

అన్నమయ్య జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో రానున్నారు. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు సంకేతాలందాయి. ఈ సందర్భంగా జిల్లాలో ఆదర్శవంతంగా చేపట్టిన జలధార కార్యక్రమ ఫలితాలను వీక్షిస్తారు. అనంతరం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టనున్న పనులను పరిశీలించనున్నట్లు సమాచారం. మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా సీఎం జిల్లాకు రానున్నారు.