'పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి'
VKB: ఎన్నికల్లో భాగంగా పోలింగ్ విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని పరిశీలకులు యాస్మిన్ భాష తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ నిర్వహించే అధికారుల పేర్లను ర్యాండమైజేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని తెలిపారు.