జాతీయ లోక్ అదాలత్‌లో 740 కేసులు పరిష్కారం
MNCL: బెల్లంపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయింది. వివిధ కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. జడ్జి ముకేశ్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ సందర్బంగా బెల్లంపల్లి కోర్టులో 740 కేసులు పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని అయన సూచించారు.