నందిపేట్లో సిలెండర్ లీకై మంటలు

నిజామమాబాద్: నందిపేట మండల కేంద్రం నియో లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదుట ఇంట్లో శుక్రవారం సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న గంధం గంగమణి కేకలు పెడుతూ బయటకు రావడంతో స్థానికులు వెంటనే తేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసి చివరకు మంటలను ఆర్పివేశారు. మంటలంటుకోవడం వల్ల ఇంట్లో ఉన్న విలువైన బట్టలు, బెడ్డు కాలిపోయాయి.