చీరాలలో పట్టపగలే దారుణం

BPT: చీరాల మండలంలో బుధవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన రెహమాన్ అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బంగారం పేరుతో చీరాలకు రప్పించారు. ఈ క్రమంలో రెహమాన్ ని కత్తితో పొడిచి అతని దగ్గర ఉన్న రూ. 4లక్షలతో పరారయ్యారు. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.