నేడు మండలంలో పవర్ కట్

ప్రకాశం: జరుగుమల్లి మండలంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా ఏఈ హరీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. కరెంట్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నామని చెప్పారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.