పాలీసెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
AKP: నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ తాతాజీ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకులు తెచ్చుకునే విధంగా కళాశాల అధ్యాపకులు శిక్షణ అందిస్తున్నారన్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ సైతం విద్యార్థులకు ఇస్తున్నామని పేర్కొన్నారు.