ఉపరితల గనిని సందర్శించిన సింగరేణి డైరెక్టర్

ఉపరితల గనిని సందర్శించిన సింగరేణి డైరెక్టర్

PDPL: రామగుండం 3 సింగరేణి డైరెక్టర్ ఎల్‌వీ. సూర్యనారాయణ రామగుండం 3 ఏరియాలోని ఓసీపీ–1 ఉపరితల గనిని సందర్శించారు. క్వారీలో జరుగుతున్న పనులు, భద్రతా చర్యల గురించి ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు ఆయనకు వివరించారు. అనంతరం డైరెక్టర్ ఎస్ఎంఎస్ ప్లాంట్‌ను పరిశీలించి, సామర్థ్య పెంపు పనుల పురోగతిని సమీక్షించారు.