నిన్నటి వరకు అడవి.. నేటి నుంచి ప్లే గ్రౌండ్

కృష్ణా: విస్సన్నపేట, స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణం నిన్నటి వరకు అడవిని తలపించే విధంగా ఉండేది. ఎంపీడీవో చిన్న రాట్నాలు ఆదేశాలతో ప్లే గ్రౌండ్‌గా అందరినీ ఆకర్షిస్తుంది. మార్నింగ్ వాకింగ్ చేసే వారికి, ఆటలు ఆడుకునే వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీడీవో చేసిన పనికి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.