అభ్యుదయ వాది బసవేశ్వర మహారాజ్

అభ్యుదయ వాది బసవేశ్వర మహారాజ్

SRCL: సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వర మహారాజ్ అని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. బసవేశ్వర మహారాజ్ జయంతి సందర్భంగా సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వర మహారాజ్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.