KPHB OYOలో పోలీసుల రైడ్స్
HYD: నగరంలోని హోటళ్లలో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. KPHB కాలనీ రోడ్ నం. 3లోని OYO హోటల్‌లో రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు కాకినాడకు చెందిన, అజయ్, రమేశ్‌గా గుర్తించారు. APలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. OYOలో రూమ్ అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.