VIDEO: ముళ్ల పొదలతో జూరాల ప్రాజెక్టు
GDWL: పర్యాటక ఆకర్షణగా నిలవాల్సిన జూరాల ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో ముళ్ల పొదలతో కనిపిస్తోంది. డ్యాం కట్టపై కంపచెట్లు పెరిగిపోవడంతో సందర్శకులకు అసౌకర్యం కలుగుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కట్టను శుభ్రపరచి సుందరీకరించాలని వారు కోరుతున్నారు.