రౌడీ షీటర్‌పై మారణాయుధాలతో దాడి
GNTR: పొన్నూరులోని మార్కెట్ సెంటర్‌లో మంగళవారం రౌడీ షీటర్ సలీంపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సలీంను స్థానికులు, పోలీసులు నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వీరా నాయక్ తెలిపారు.