సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌ను కౌన్సిలర్ హరీష్ రెడ్డి కోరారు. ఇవాళ మున్సిపల్ కమిషనర్‌తో కౌన్సిలర్ భేటీ అయ్యారు. 29వ వార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.