మద్దూరులో గాలికుంటు నివారణ టీకా ప్రారంభం
NRPT: మద్దూరు మున్సిపాలిటీలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని వెటర్నరీ డాక్టర్ సవిత ప్రారంభించగా.. రైతులు పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత టీకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి జనార్దన్, కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.