ఈనెల 19న OU స్నాతకోత్సవం.. 121 బంగారు పతకాలు

HYD: ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 19న స్నాతకోత్సవం ఉ.10 గంటలకు ప్రారంభం అవుతుందని ఉపకులపతి ఆచార్య కుమార్ తెలిపారు. మొత్తం ఈ స్నాతకోత్సవంలో 121 బంగారు పతకాలు విద్యార్థులు అందుకుంటారని,108 ఏళ్ల OU చరిత్రలో మొట్ట మొదటి సారిగా కులపతి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పేరుతో గిరిజన విద్యార్థులకు ఆంగ్లంలో అత్యుత్తమ పీహెచ్‌డీ డిగ్రీకి బంగారు పథకాన్ని ప్రవేశపెట్టారు.