నీట మునిగి గొర్ల కాపరి మృతి
MHBD: బయ్యారం మండలంలోని అలిగేటి వాగులో గొర్ల కాపరి పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం గొర్లు కాపేందుకు అడిగేరు బ్రిడ్జి సమీపానికి వెళ్లిన రాములు, గొర్లను వాగు దాటించే క్రమంలో నీటిలోకి దిగారు. ఈ సమయంలో గొర్లతో పాటు ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం అటుగా వెళ్లిన రైతులు మృతదేహాన్ని గమనించారు.