శ్రీదేవిని సన్మానించిన కలెక్టర్
WGL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో స్వయం ఉపాధిలో ప్రతిభ కనబరిచిన శ్రీదేవిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ముద్ర రుణం ద్వారా స్వయం ఉపాధి సాధించి, ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని అన్నారు.