టెస్ట్ సిరీస్ ఓటమి.. గంభీర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని తెలిపారు. తనకు పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా? లేదా? బోర్డు డిసైడ్ చేస్తుందని చెప్పారు. బోర్డుకు భారత క్రికెట్ భవిష్యత్తే ముఖ్యమని.. తాను కాదని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ నెగ్గినప్పుడు తానే కోచ్ అని గుర్తుచేశాడు.