VIDEO: 'ప్రజల గుండెల నిండా దేశభక్తిని నింపుకోవాలి'
MBNR: ప్రజలు తమ గుండెల్లో నిండా దేశభక్తిని నింపుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీని తలుచుకుంటే గుండెల నిండా దేశభక్తి ఉప్పొంగుతుందన్నారు. యువత శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.