BRS నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NLG: నల్గొండ BRS సీనియర్ నేత, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బొర్ర సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురై మలక్‌పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆయనను పరామర్శించి, వైద్యుల నుంచి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలంటూ సూచించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుధాకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.