పులివెందులలో దొంగల ముఠా అరెస్ట్
KDP: పులివెందుల అర్బన్ పోలీసులు దొంగతనాల ముఠాను అరెస్ట్ చేశారు. బస్సులు, ఇళ్లు, హాస్పిటళ్లలో చోరీలకు పాల్పడిన నిందితుల వద్ద నుంచి రూ.80.01 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. కడపతో పాటు నెల్లూరులో కూడా దొంగతనాలు చేసినట్లు ఎస్పీ విశ్వనాధ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి మారుతి స్విఫ్ట్ కారు, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు.