ఎంపీకి రాఖీ కట్టిన మాజీ ఎమ్మెల్యే

KKD: అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా, “నీ కోసం నేనున్నాను” అనే భరోసాను కలిగించే శుభ సందర్భమే రాఖీ పర్వదినమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా కాకినాడ ఎంపీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఎంపీ సానా సతీష్ బాబుకు రాఖీ కట్టారు.