మట్టి, ఇసుక మాఫియాపై అధికారుల కొరడా

మట్టి, ఇసుక మాఫియాపై అధికారుల కొరడా

NLG: జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను వెంటనే సీజ్ చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేశారు.