ఎనుమాముల మార్కెట్లో తగ్గిన పత్తి ధర

ఎనుమాముల మార్కెట్లో తగ్గిన పత్తి ధర

వరంగల్: ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గురువారం (నిన్న) క్వింటా పత్తికి రూ.7,315 ధర రాగా.. ఈరోజు (శుక్రవారం) రూ.7250 కి పడిపోయింది. ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రేపటినుండి మార్కెట్ కు వరుసగా మూడు రోజుల వరుస సెలవులు నేపథ్యంలో ఈరోజు పత్తి తరలివచ్చింది.