అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యేే
జగిత్యాల పట్టణ 25వ వార్డులో రూ. 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయాలని సూచించారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.