నల్గొండలో సాహిత్య సమ్మేళనం
NLG: నల్గొండలోని యూటీఎఫ్ భవన్‌లో గ్రంథాలయ ఉద్యమకారులు వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం సాహిత్య సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కవి సమ్మేళనం సదస్సు బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో పలువురు సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు.