VIDEO: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
PDPL: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ సమీకృత కలెక్టరేట్లో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లికి చెందిన రాధ, అంతర్గాం మండలం విస్సంపేటకు చెందిన కిట్టయ్య ఇందిరమ్మ ఇల్లు కావాలని వినతి పత్రాలు సమర్పించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.